ఫుల్లుగా తాగి 100 కి ఫోన్లు.. తర్వాత ఏమైందంటే..

నాంది, ఖానాపూర్ : ఫుల్లుగా తాగేశాడు.. ఏం చేయాలో అర్థం కాలేదు.. వరుసగా 100 డయల్ కి కాల్స్ చేశాడు.. ఆ తర్వాత ఎమైందంటే.. ఖానాపూర్ మండలం రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మణ్ (38). ఫుల్లుగా తాగాడు. డయల్ 100 నెంబర్ కు ఫోన్లు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మణ్ ను కోర్టుకు పంపడంతో అతనికి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదారావు , ఎస్సై లింబాద్రి తెలిపారు.