పర్యావరణ హితంగా వినాయక చవితి

పర్యావరణ హితమే లక్ష్యంగా వినాయకచవితి జరుపుకోవాలని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్, కృష్ణవేణి విద్యాసంస్థల అదినేత కస్తూరి పద్మచరణ్ అన్నారు. కస్తూరి ఫౌండేషన్, పద్మచరణ్ కృష్ణవేణి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేలా మట్టి వినాయకులని ఉపయోగించాలన్నారు. వినాయచవితి అంటేనే ప్రకృతి పండగ అని స్పష్టం చేశారు. అందుకే కొన్ని సంవత్సరాలుగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.