పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ప‌ది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రూ. 52 320 న‌గ‌దు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లా కేంద్రం మార్కెట్ ఏరియాలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నార‌నే స‌మాచారంతో మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ ఉపేందర్ సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న నల్మాస్ జీవన్ కుమార్ (గౌతమినగర్, మంచిర్యాల), బుధార్థి శంకర్ (హమాలివాడ, మంచిర్యాల), పార్థ రాజేంద్ర ప్రసాద్ (కాలేజ్ రోడ్, మంచిర్యాల), చందూరి సుదాకర్ (రామ్‌నగర్, మంచిర్యాల), గోపాల్ శర్మ (మంచిర్యాల), దాసరి రవి (ఇందారం), పులి శ్రీనివాస్ (రామకృష్ణాపూర్, రామాలయం ఏరియా), బోనగిరి యాదగిరి (తోళ్ల‌వాగు , మంచిర్యాల‌), సునీల్ కుమార్ బల్ద్వ (శ్రీనివాస్ టాకీస్ లైన్, మంచిర్యాల‌), మిట్టపెల్లి రామారావు (మంచిర్యాల)ల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని మంచిర్యాల పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించిన‌ట్లు వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like