విదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో పాటు వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. వర్షాలు కురుస్తున్నందున సీజినల్ వ్యాదులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం
అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షాల వల్ల వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వ్యాధులు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరు భాద్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఓపీ వివరాలు, మందుల స్టాక్వి వరాలు తెలుసుకున్న కలెక్టర్ సీజినల్ వ్యాదులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జ్వర సర్వే పక్కాగా చేయాలని, అవసరం ఉన్న చోట హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
అక్కడి నుండి ఆలుగామ వెళ్ళిన కలెక్టర్ గ్రామంలో పారిశుద్య కార్యక్రమాలను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో చెత్త పేరుకుపోయి ఉండటంతో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. పారిశుద్ధ్య పనులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామంలో జ్వర సర్వే జరిగిందా..? అని అడగగా పంచాయితీ కార్యదర్శి జరిగిందని చెప్పారు. గ్రామస్తులను అడిగితే అలాంటిదేమి జరగలేదని చెప్పటంపై పంచాయితీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, విధులకు క్రమంతప్పకుండా హాజరుకావాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున ప్రాణహిత నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో పడవ ప్రయాణాలను నిషేదించాలన్నారు. కలెక్టర్వెం ట డీపీఓ వెంకటేశ్వర్ రావ్, తహసీల్దార్ మహేంద్రనాథ్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, ఇన్చార్జి ఎంపీడీఓ సత్యనారాయణ సిబ్బంది ఉన్నారు.