అన్నను నరికి చంపిన తమ్ముడు
Murder:నిర్మల్ జిల్లా కేంద్రంలో అన్నను తమ్ముడు నరికి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడలో అన్న శంబాజీ (35)ని తమ్ముడు శివ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. తాగిన మత్తులో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇక కొమురంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్-2 లో అన్న పై తమ్ముడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అన్న కు తీవ్రగాయాలు కాగా, హాస్పిటల్ తరలించారు. కుటుంబ గొడవలతోనే ఈ దాడి జరిగినట్లు స్ధానికులు చెబుతున్నారు.