అక్రమ గ్యాస్ సిలెండర్ల స్వాధీనం
Possession of illegal gas cylinders:గృహ అవసరాలకు విని యోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను హోటల్స్ వాడుతుండటంతో అధికారుల చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్ పై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రి ఏరియా నుంచి కలెక్టర్ చౌక్ వరకు తనిఖీ చేసారు. ఈ సందర్భంగా 15 సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. గృహ అవసరాలకు విని యోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య కార్యక్రమాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.