పిడుగు పడి మహిళ మృతి

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచలాపూర్ లో పిడుగు పడి ఒక మహిళ మృతి చెందింది. గోలెం పోసక్క (55) పొలంలో పనులు చేసుకుని తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 4 గంటల సమయంలో పిడుగు పడి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.