మృతుని కుటుంబానికి చెక్కు

A check to the family of the deceased:కాగజ్ నగర్లోని అశోక్ కాలనీలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా మరణించిన మున్సిపల్ బిల్ కలెక్టర్ లింగంపల్లి నాగేష్ కుటుంబాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన లక్ష రూపాయల చెక్కు నాగేష్ భార్య లక్ష్మికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగేష్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అలాగే ఇన్సూరెన్స్ క్లైమ్‌కు పూర్తి సహకారం అందిస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాజపా పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, భాజపా మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, రాణి, మాచర్ల శ్రీనివాస్, చిప్పకుర్తి, శ్రీనివాస్, ప్రణయ్, రేహన్, ఆతిక్, మాజిద్, కార్మిక అధ్యక్షులు శంకర్, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.