దసరాకు ఆ ఊరోళ్ల బంపరాఫర్

గొర్రె పొట్టేలు, మేక, నాటు కోడి, ఫుల్ బాటిళ్లు ఇప్పటికి మీకు అర్దం అయ్యే ఉంటుంది… రాబోయేది దసరా సీజన్.. ఇక దసరా అంటే మామూలుగా ఉండదు కదా.. ముక్క, చుక్క ఉండాల్సిందే.. మందు బాబులకు రెండు, మూడు రోజుల వరకూ పండగే. సరిగ్గా ఇదే ఆలోచించారు ఆ ఊరోళ్లు.. బంపర్ డ్రా పెట్టి మరీ వీటిని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ ఊరేంటి.. ఆ కథేంటి అంటే..మంచిర్యాల జిల్లా బోయపల్లి గ్రామస్తులు దసరా పండగ వినూత్నంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రూ. 100కు ఒక కూపన్ ప్రకటించారు. ఈ కూపన్ తీసుకుంటే లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చే నెల 10న డ్రా తీస్తారు. అందులో బహుమతులు ప్రకటించిన వారికి అందచేస్తారు.
మొదటి బహుమతి – గొర్రెపొట్టేలు
రెండవ బహుమతి – మేక
మూడవ బహుమతి – జానీవాకర్ ఫుల్‌బాటిల్
నాలుగో బహుమతి – టీచర్స్ ఫుల్‌బాటిల్
ఐదో బహుమతి – బ్లాక్ డాగ్ ఫుల్‌బాటిల్
ఆరో బహుమతి – 100 పైపర్స్ ఫుల్ బాటిల్
ఏడు, ఎనిమిదో బహుమతి – నాటుకోడి పుంజు
తొమ్మది, పదో బహుమతి – నాటుకోడి పెట్టె
ఇలా ప్రకటించడంతో జనం పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు. రెండు రోజుల్లోనే దాదాపు 50 శాతం కూపన్స్ అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు మాసాడి శశివర్థన్ , మాసాడి విజయ్‌కుమార్ తెలిపారు.