తాండూరుకు ఎల్లంపల్లి నీళ్లు

MLA Gaddam Vinod: తాండూరు మండలాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువెళ్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి అన్నారు. తాండూరు మండలకేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు మండలంలో రూ.6 కోట్ల 65 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తాండూరు మండలం ప్రజలకు త్రాగునీరు ఎల్లంపల్లి నుండీ ఇవ్వడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నాయకులు, ప్రజల సహకారంతో తాండూరు మండలం ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.