పేకాట ఆడుతున్న మహిళల అరెస్టు

అవనిలో సగం… ఆకాశంలో సగం అని అంటూ ఉంటారు.. మనం వింటూనే వింటున్నాం.. ఆ మాటలు వంట పట్టించుకున్నారో ఏమో కానీ, ఎందులో తాము తక్కువ కాదనుకున్నారు.. అందుకే పేకాట మగవాళ్లే కాదు..తాము ఆడుతామని నిరూపించాలనుకున్నారు… వాళ్లు కూడా జూదం ఆడేందుకు సై అన్నారు.. అయితే పోలీసులు ఊరుకుంటారా..? పేకాట రాణులను అరెస్టు చేశారు.. ఇంతకీ పేకాట ఆడుతూ పట్టుబడ్డ మహిళామణులు ఎక్కడి వారు..? ఏ జిల్లాలో జరిగింది…
నిజామాబాద్ సరస్వతి నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనే మహిళలు ఏకంగా క్లబ్‌గా మార్చేశారు. జిల్లాకేంద్రంలోని నీలోఫర్ ఆసుపత్రి 4వ అంతస్తులో మహిళలు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలతో పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బుద్దినేని గోదాదేవి, గుమ్మల సౌందర్య, కళావతి, రాచకొండ గంగ, ధర్మగడ్డ లత ఉన్నారు. వారి వద్ద ₹ 15,100 రూపాయలు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ మహిళలు ప్రముఖ వైద్యుల సతీమణులు కావడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దాడులు జరగడంతో వారి అరెస్టు తప్పలేదు.