ఆయన జీవితం.. భవిష్యత్ తరాలకు ఆదర్శం..
స్వాతంత్ర సమరయోధుడు, తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ మహనీయుడని.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని, ఆస్తులను దానం చేశారన్నారు. స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐదు దశాబ్దాలుగా అలుపెరగని కృషి చేశారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారని వారి జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శం అన్నారు .కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్స్పెక్టర్ లు రవీందర్, అజయ్ బాబు, ఆర్ఐ దామోదర్, మల్లేశం, శ్రీనివాస్, వామన మూర్తి, సంపత్, సూపరిండెంట్ ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, సంధ్య పాల్గొన్నారు.