రోడ్డు ప్రమాదంలో ఐదురురి మృతి
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ఢీకొట్టి కొద్దిదూరం వెళ్లి బోల్తా పడింది. దీంతో ఐదురుగు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ఎనిమిది మందితో ఆదిలాబాద్ వస్తున్న ఇసుజీ వాహనం ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ మొయిజ్ (60), ఎనిమిదేళ్ల బాబు అలీ, ఖాజా మొయినుద్దీన్ (40), మహమ్మద్ ఉస్మానుఉద్దీన్ (11) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడ్డ ఫరీద్(12) రిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయేషా ఆఫ్రిన్ (38) ఎఖ్రా (4), సాద్ (11)ను 108 అంబులెన్స్ల్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబందికులే. గాయపడ్డ వారికి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మృతదేహాలను మార్చిరీకి తరలించారు.