నా భర్తకు ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పేట్రేగిపోతున్నాయని హాజీపూర్ మాజీ ఎంపీపీ, బాధితుడి భార్య స్వర్ణలత ఆరోపించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి వద్ద బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం కుట్ర దాగుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త వెళుతున్న కారు అడ్డగించి దాడి చేశారని అన్నారు. స్థానికులు గుర్తించి మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని, మాకు సమాచారం అందడంతో హాస్పిటల్ వచ్చామన్నారు. మంచిర్యాల పట్టణ పోలీసులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని చెప్పి హైడ్రామా సృష్టించి తమకు చెప్పకుండా తన భర్తను ఎక్కడికో తీసుకువెళ్లారని ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు గాయపడిన తన భర్తను ఇబ్బందులకు గురి చేస్తూ గందరగోళం సృష్టించారని అన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే పోలీసులపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. తన భర్తకు ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు.