మంచిర్యాలలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది
మంచిర్యాలలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం హైదరాబాద్లో డీజీపి జితేందర్ నీ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నాయకుల పై కక్ష పూరితంగా అధికార పార్టీ నాయకులు అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్ పంపుతున్నారనీ అవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు గ్యాంగులుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో అలజడి సృష్టించి పలువురు యువకులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటీవల మంచిర్యాలలో జరిగిన దాడుల ఘటనల వల్ల లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రఘునాథ్ డీజీపీని కోరారు.