నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో మంటలు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గదిలో నుండి మంటలు చెలరేగడంతో గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే రోగులను బయటికి పంపించారు. అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పిల్చుకున్నారు.