కోతులు భయపెట్టడంతో మహిళ మృతి
Nirmal: కోతులు భయపెట్టడంతో కింద పడి మహిళ మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనికి చెందిన బొంగోని లక్మి (52) ఇంటి ముందు కూర్చొని ఉంది. అటుగా వచ్చిన కోతులు మహిళను బెదిరించడంతో భయపడి పరుగెత్తే ప్రయత్నం చేసింది. దీంతో కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె వెంటనే కోమాలోకి వెళ్ళింది. బంధువులు హుటాహుటిగా హాస్పిటల్ తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. కోతులను అదుపు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.