రూ. కోటి విలువ చేసే గంజాయి దహనం
48 కేసుల్లో, 411 కేజీల గంజాయి దహనం

Marijuana burning: పలు కేసుల్లో దొరికిన గంజాయిని సోమవారం సాయంత్రం నిజామాబాదులో దహనం చేశారు. వివిధ కేసుల్లో పట్టుకున్న గంజాయిని దహనం చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదిలాబాద్ జిల్లాకు చెందిన అదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఉన్న 411 కేజీల గంజాయిని నిజామాబాద్ జిల్లాలోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గంజాయిని దగ్ధం చేసినట్లు ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు.
దగ్ధం చేసిన గంజాయి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 340 కేజీలు, ఇచ్చోడలో 37 కేజీలు, ఉట్నూర్ లో 33 కేజీల గంజాయి ధ్వంసం చేశారు. ఈ గంజాయిని ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ హిమశ్రీ, పోలీస్ స్టేషన్లో సిఐలు కలిసి దహనం చేశారు. వివిధ కేసుల్లో పట్టుకున్నటువంటి గంజాయిని దహనం చేసిన అదిలాబాద్ ఎక్సైజ్ అధికారులకు సిబ్బందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి అభినందనలు తెలిపారు.