కాంగ్రెస్ నేత దారుణ హత్య

A brutal murder of a Congress leader: కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణహత్య గురయ్యాడు. కారుతో ఢీకొట్టి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న గంగిరెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. హత్యకు నిరసనగా … జగిత్యాల పాతబస్టాండ్ వద్ద తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నాయకులకు రక్షణ లేనప్పుడు తామెందుకని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. జగిత్యాలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వమా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ తమ నేతలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని ఆరోపించారు జీవన్ రెడ్డి. గతంలో డయల్ 100 ఫోన్ చేసి గంగారెడ్డి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అప్పుడే చర్యలు తీసుకుంటే ఈ దారణం జరిగేది కాదన్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు.