ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఊరట

Kova Laxmi: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి కోర్టులో ఊరట దక్కింది. రాష్ట్ర హైకోర్టులో ఆమెకి వ్యతిరేకంగా ఎన్నికల సందర్భంగా దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. కోవలక్ష్మి ఎన్నికల అఫిడవిట్లో ఆదాయపన్ను (income-tax) లెక్కలు తప్పులు ఉన్నాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్ కోర్టుకు ఎక్కారు. 2023 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని తన ఎన్నిక చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోవ లక్ష్మి 2023 ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచిందని పిటిషన్ వేశారు. ఈ కేసు గత 9 నెలలుగా కొనసాగుతోంది. అయితే.. ఇవాళ కేసు విచారించిన హైకోర్టు దానిని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవలక్ష్మి ఎన్నికల అఫిడవిట్ లో income-tax లెక్కలు తప్పులు లేవని తేల్చేసింది.