కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు
పత్తి కొనుగోళ్ల విషయంలో ఆలస్యం చేయవద్దని, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఓ రైతు కలెక్టర్ కాళ్లు మొక్కారు. ఈ రోజు ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభిచేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే, తేమ విషయంలో సీసీఐ అధికారులు, ప్రైవేటు వ్యాపారులు కొర్రీలు పెట్టారు. 8 నుండి 12% తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామన్న సిసిఐ తేల్చి చెప్పింది. అయితే, తేమశాతం సగటున 17 నుండి 23% ఉండడంతో నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేది లేదని సీసీఐ అధికారులు తేల్చి చెప్పారు. దాదాపు నాలుగు గంటల పాటు కలెక్టర్ రాజర్షిషా అధికారులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో రైతులకు న్యాయం చేయాలంటూ ఓ రైతు కలెక్టర్ కాళ్లు మొక్కారు.కనికరించండి సార్..అంటూ వేడుకున్నాడు. పక్కనే ఉన్న పోలీసులు, సిబ్బంది రైతులు పక్కకు జరిపారు.