ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

దీపావళి పండగ కోసం సొంత గ్రామానికి వచ్చి, గోదావరిలో ఈత కోసం దిగిన ఇద్దరు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. చెన్నూర్ మండలం దుగ్నెపల్లికి చెందిన కొండు అరుణ్ (19), దాసరి సాయి (18) అన్నారం బ్యారేజ్ వద్ద గోదావరిలో గల్లంతయ్యారు. చెన్నూర్ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుణ్ కిషంపేట డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దాసరి సాయి కరీంనగర్ ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మెదటి సంవత్సరం చదువుతున్నాడు. దీపావళి పండగ కోసం స్వగ్రామమైన దుగ్నెపల్లికి వచ్చారు. శుక్రవారం ఉదయం నలుగురు స్నేహాతులతో కలిసి అరుణ్, సాయి అన్నారం బ్యారేజ్ సమీపంలో గోదావరికి స్నానానికి వెళ్లారు. బ్యారేజ్ గేట్లు తీసి ఉండండంతో వరద ఉదృతి వేగంగా ఉంది. స్నానం చేస్తు ఈత కొట్టుతున్న సమయంలో అరుణ్, సాయి ఇద్దరు వరద ఉదృతికి గల్లంతయ్యారు. వారితో వచ్చిన నలుగురు స్నేహితులు క్షేమంగా బయట పడినట్లు సీఐ వివరించారు. గల్లంతైన వారి కోసం 10 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృత దేహాలను వెతికితీసినట్లు సీఐ తెలిపారు. మృతుల తల్లిదుండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టర్ కోసం మృత దేహాలను చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.