మీడియా మా ఇంటికి రావొద్దు
మహిళా అఘోరి కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దనీ, సమస్య సీఎం వరకు కూడా తీసుకువెళ్తానంటూ అహోరి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. కొంత సమన్వయం పాటించాలని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. శాంతియుత వాతావరణం కోసం మీరు సహకరించాలని, ఎలాంటి ఇబ్బందులు కలిగిన మా దృష్టికి తీసుకురావాలన్నారు.
మా ఇంటికి వైపు మీడియా రావొద్దని అఘోరీ తల్లిదండ్రులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మీడియా తో చాలా ఇబ్బంది ఉందని తెలిపారు. ఎమ్మెల్యే వినోద్ పోలీస్ ప్రొడక్షన్ కోసం ఏసీపి కి ఆదేశాలు జారీ చేశారు.