ఏటీఎంలో చోరీకి యత్నం.. పట్టుకున్న పోలీసులు
The police caught the attempt to steal from the ATM: ఏటీఎం చోరీకి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితఏ.. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏటిఎంలో ఓ యువకుడు దొంగతనానికి యత్నించాడు. ఈ రోజు తెల్లవారు ఝామున నిర్మల్ పట్టణం కెనరా బ్యాంక్ మేనేజర్ 100 dailకి కాల్ చేసి డాక్టర్ లైన్లో ఏటీఎంలొ ఎవరో గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. వెంటనే పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. బస్టాండ్ దగ్గర వెల్మెల్ బొప్పారం గ్రామానికి చెందిన కుంచం గంగాధర్ అనే వ్యక్తిని గుర్తించి పట్టుకున్నారు. 100 డైల్ కాల్ కి తక్షణమే స్పందించి చాకచక్యంగా దొంగని పట్టుకొన్న ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ప్రశంసించారు