కాంగ్రెస్ నేత శ్యాం నాయక్ అరెస్ట్
Congress leader Shyam Naik arrested: కాంగ్రెస్ నేత శ్యాం నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ లో శనివారం బీసీ కుల గణన కార్యచరణ ప్రణాళికలో భాగంగా కార్యకర్తలు, నేతల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని శ్యామ్ నాయక్ వర్గం ఆరోపించింది. తాము అందరికీ సమాచారం ఇచ్చామని విశ్వప్రసాద్ వర్గం చెప్పడంతో గొడవ మొదలైంది. సమావేశంలో కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. పరస్పర వ్యతిరేక నినాదాలతో గందర గోళ పరిస్థితి ఏర్పడింది. డీసీసీ అధ్యక్షున్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ నాయక్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయనకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఆయినా శ్యామ్ నాయక్ తన ఆందోళన విరమించలేదు. ఒకానొక దశలో మీటింగు హాల్ లోకి ఆయన వర్గం దుసుకువెళ్ళందుకు ప్రయత్నం కూడా చేశారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.