బాబోయ్ పులి..

Tiger attack on cattle:పశువులపై పులి వరసగా దాడులు చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం సూర్యపూర్ కి చెందిన హనుమంతు అనే పశువుల కాపరి అటవీ ప్రాంతంలో పశువుల మందకు మేపడానికి వెళ్ళాడు. ఒక్కసారి పెద్దపులి లెగదూడ పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనిని గమనించిన పశువుల కాపరి చెట్టు ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అడవికి వెళ్లాలంటే భయంగా ఉందని హనుమంతు తెలిపారు. పశువులు చెల్లచెదురుగా అడవిలో పరిగెత్తడంతో గమనించిన మిగతా పశువుల కాపారులు కేకలు వేయగా పులి అడవి లోకి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాను దాడి చేసిన దూడ కళేబరాన్ని రాత్రి వచ్చి పులి మిగతా సగ భాగాన్ని తినేసింది ఫారెస్ట్ అధికారులు పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. రైతులు పశువుల కాపరులకు ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఒక కట్టెకు గజ్జ కట్టి కేకలు వేస్తూ గుంపులు గుంపులుగా అడవిలోకి వెళ్లాలని గ్రామస్తులకు సూచించారు. పులి సంచారం నేపథ్యంలో సూర్యపూర్ పరిసర గ్రామాల రైతులు అడవికి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు.