మ్యాట్రిమోని పేరుతో మోసం
వారిద్దరూ బార్యాభర్తలు… మ్యాట్రిమోనిలో ఒక ప్రొఫైల్ ప్రారంభించారు. దానికి స్పందించిన వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతూ మోసానికి పాల్పడ్డారు…
మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మ్యాట్రిమోని పేరుతో మోసపోయానని పోలీసులకు ఫిర్యాధు చేశాడు. మోసగాళ్ళ చేతిలో చిక్కుకొని రూ. 17 లక్షలు మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాధు చేశాడు. వెంటనే సైబర్ క్రైమ్ ఎస్.హెచ్.ఓ DSP వెంకటరమణ, ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంబించారు. ఏలూరు జిల్లాకి చెందిన ఎర్ర వెంకటనాగరాజు, ముత్తరానికి చెందిన రామంచ సౌజన్య వీరిద్దరూ కలిసి తెలుగు మ్యాట్రిమోనీ డాట్ కామ్ అనే వెబ్సైట్ లో అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రోఫైల్ ఏర్పాటు చేశారు.
అందమైన అమ్మాయిల ఫోటోలు అప్లోడ్ చేస్తూ అబ్బాయిలకు రిక్వెస్ట్ పెట్టారు ఎవరైతే వాటికీ స్పందిస్తారో, వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ లో ఉందని హాస్పిటల్ కి ఖర్చులకు డబ్బులు కావాలని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు. ప్రజలు మ్యాట్రిమోనీ డాట్ కామ్ అనే వెబ్సైట్లో గుర్తు తెలియని వ్యక్తుల నుండి రిక్వెస్ట్ రాగానే వాటికీ స్పందించి సైబర్ మోసాలకు గురవకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ ఎస్ హెచ్ వో DSP వెంకటరమణ తెలిపారు.