గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
Constable died of heart attack: కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. మాడావి ఆనంద్ కుమార్ కాగజ్‌నగర్ పట్టణంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయాడు. ఆసుపత్రికి తరలించే సరికి చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజుల కిందట ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ శంకర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సిర్పూర్ టీ మండలం హుడికిలి వద్ద చెక్ పోస్ట్లో విధులు నిర్వర్తిస్తున్న శంకర్ విధి నిర్వహణ నిమిత్తం కాగజ్ నగర్ నుండి సిర్పూర్ టి వెళ్లే ప్రధాన రహదారిలో వేంపల్లి గ్రామం వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం సిర్పూర్ టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
ఈ విషాదఘటన మరువకముందే మరో కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది.