రౌడీషీటర్ పై పిడి యాక్ట్

మరి కొంతమంది జాబితా సిద్ధం

మంచిర్యాలలో ప్రజలను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కుంట శ్రీనివాస్ అనే వ్యక్తి పై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ పీడీయాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు మంచిర్యాల పట్టణ ఇన్స్ స్పెక్టర్ ప్రమోద్ రావు, నిందితుడికి ఆదిలాబాద్ జిల్లా జైల్ లో ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

పీడీ యాక్ట్ అందుకున్న నిందితుదు కొన్ని నెలలుగా మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం, భూ కబ్జాలు, అక్రమంగా ఇతరుల ఆస్థి లలోకి ప్రవేశించడం, బెదిరింపులలకు, దాడులకు పాల్పడడం తో 4 కేసులు నమోదు చేశారు ఆ కేసులలో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు, గతంలో రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో జైలుకు వెళ్ళిన అతని నేర ప్రవృత్తి తీరులో మార్పు రాకపోవడంతో నిందితుడి పై పిడి యాక్ట్ నమోదు చేసినట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.

గ్రూప్ లుగా ఏర్పడి గొడవలకు పాల్పడి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించే చర్యలు, , హత్యాయత్నాలు, హత్యలకు పాల్పడిన నిందితులు, అక్రమ ఫైనాన్స్, గంజాయి అక్రమ రవాణా చేసే వారూ, పేకాట, పిడియస్ రైస్ అక్రమ రవాణా, భూ కబ్జాలకు పాల్పడే, వైట్ కాలర్ అఫెండర్స్ జాబితా సిద్ధం చేశామని త్వరలో వారిపై పిడి అమలు చేస్తాం అని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలతో పాటు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like