ఫుడ్ పాయిజన్ తో ఒకరి మృతి.. హోటల్ సీజ్
One person died of food poisoning.. Hotel siege:ఫుడ్ పాయిజన్ తో ఒకరి మృతి చెందటంతో ఆ హోటల్ సీజ్ చేశారు అధికారులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్ 9 అనే హోటల్ లో భోజనం చేసిన ఐదుగురికి ఫుడ్ పాయిజన్(food poison) అయ్యింది. ఇందులో పూల్ కాలే బైగా అనే యువతి మృతి చెందింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి గ్రిల్ నైన్ రెస్టారెంట్ సీజ్ (siege) చేశారు. హోటల్ యజమాని పరారిలో ఉన్నాడని అధికారులు వెల్లడించారు.