సీఎం ఫ్లెక్సీల చింపివేత..
Tearing of CM Flexis:కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీని చింపివేయడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్బంగా నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దానిని కొందరు చింపివేశారు. అయితే వాటిని బీఆర్ఎస్ నేతలే చింపారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దగ్గరుండి ఫ్లెక్సీ ని చింపి వేయించారని నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ విషయంపై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.