ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య

ములుగు (Mulugu)జిల్లాలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్య చేశారు. వాజేడు మండలానికి చెందిన ఇద్దరు గిరిజనుల్ని నరికి చంపారు. రమేష్ (Ramesh), అర్జున్ (Arjun) అనే ఇద్దర్ని హతమార్చినట్లుగా మావోయిస్టులు లేఖ వదిలివెళ్లారు. మావోయిస్టు వెంకటాపురం వాజేడు కమిటీ కార్యదర్శి శాంత పేరుతో రెండు ప్రదేశాలలో లేఖలు విడుదల చేశారు.

మావోయిస్టు పార్టీ దళాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రమేష్ అనే వ్యక్తి ఛత్తీస్గఢ్ లోని వారి బంధువుల ద్వారా,గ్రామాల్లో ఉన్న పరిచయస్తుల ద్వారా తెలుసుకొని ఎస్ఐబి వారికి సమాచారాన్ని చేరవేస్తున్నాడు. మావోయిస్టు సానుభూతిపరుల సమాచారాన్ని కూడా పోలీసులకు అందిస్తూ వారిని చిత్రహింసలకు గురి చేస్తూ మావోయిస్టు పార్టీకి తీరని అన్యాయం చేస్తూ, పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారిన అతన్ని హత్య చేసినట్లు పేర్కొన్నారు..

అశోక్ అనే వ్యక్తి అడవుల్లో కర్రెల కోసం, చాపల వేట కోసం, పశువుల కాపరిగా రకరకాల అవతారాలతో అడవుల్లో సంచరిస్తూ మావోయిస్టు పార్టీ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాదు. ఎన్నిసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదు కాబట్టి హత్య చేసినట్లు పేర్కొన్నారు..

ఒకే సమయంలో రెండు పార్టీలుగా వచ్చిన మావోయిస్టులు ఇద్దరిని హత్య చేయడంతో ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు భయాందోళన గురయ్యారు. ఒక్కసారిగా మావోయిస్టుల ప్రతీకార చర్యతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలా రోజుల తర్వాత మావోయిస్టులు ప్రత్యక్షంగా ఈ హత్యలు చేయడంతో మావోయిస్టుల ఉనికి ములుగు జిల్లాలో చాటుకున్నట్లైంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like