భారీ ఎన్కౌంటర్.. మృతుల్లో అగ్రనేతలు
Encounter:ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి.ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం.
మావోయిస్టులకు అడ్డాగా ఉన్న చత్తీస్ ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. కాల్పులు జరుపుతున్న మావోయిస్టులను మట్టుబెట్టేందుకు బలగాలు మోహరించాయి. మృతుల నుంచి భారీఎత్తున ఆటోమేటెడ్ ఆయుధాలు, ఏకే 47 సహా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.