బ్రేకింగ్ – మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని
A student who lost a fight with death: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కి(Food poisoning) గురై కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది.
అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా హైదరాబాద్ నిమ్స్‌లో చేర్పించారు. వీరిలో ఇద్దరు కోలుకున్నారు. శైలజ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. దాదాపు 20 రోజులుగా చికిత్స పొందిన ఆమె ఈ రోజు మరణించారు.