ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయండి
Ethanol factory: ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే నిలిపివేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు.నిర్మల్ జిల్లా దిలావార్ పూర్ మండలం ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా గ్రామస్థులతో చర్చలు జరిపేందుకు వెళ్లిన ఆర్డీవోను దాదాపు ఆరు గంటల పాటు నిర్బంధించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులతో కలెక్టర్ అభిలాష అభినవ్ చర్చలు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి నివేదించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లినట్లు తెలిపారు. ఎట్టకేలకు ఫ్యాక్టరీ పనులు నిలిపివేయవలసిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.