బిగ్ బ్రేకింగ్: పులి దాడిలో మహిళ మృతి
Tiger Attack: పులి దాడిలో మహిళ మృతి చెందిన ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కాగజ్ నగర్ మండలం విలేజీ నంబర్ 11 కు చెందిన మహిళ పై పులి దాడి చేసింది. వ్యవసాయ పనులకు వెళ్తుండగా గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ అనే మహిళ పై దాడి చేసిన నేపథ్యంలో తీవ్ర గాయాలయ్యాయి. అమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. అమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.