Big Breaking : ఏసీబీ దాడులు.. జూనియర్ అసిస్టెంట్ పట్టివేత
ACB: కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు నిర్వహించి లంచవతారాన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సర్వే ల్యాండ్ రికార్డ్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు చేపట్టారు. కార్యాలయంలో పనిచేస్తున్న గాంధారి జగదీష్ అనే జూనియర్ అసిస్టెంట్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్ కాలనీకి చెందిన సల్ల హరీష్ కుమార్ అనే వ్యక్తి నుండి సేతువార్ కోసం ఇరవై వేలు డబ్బులు డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు కార్యాలయంలో భార్య జోష్ణ స్థానంలో అటెండర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ రూ.10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధ శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఆయన వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.