మోర్లే లక్ష్మి కుటుంబానికి రూ .10 లక్షలు

Tiger Attack: ఆసిఫాబాద్ కోమురం భీమ్ జిల్లా పులి దాడి ఘటనలో మరణిం చిన గన్నారం మండలం ఇస్ గాం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు 10 లక్షల చెక్కు కవ్వాల్ టైగర్‌ రిజర్వ్‌ అటవీ సంరక్షణాధికారి, ఫీల్డ్‌ డైరెక్టర్‌ శాంతారాం అందజేశారు.

పత్తి సేకరణకు వెళ్లిన లక్ష్మి పులి దాడిలో మరణించడం ఎంతో వేదనకు గురి చేసిందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. శాఖాపరంగా అటవీ శాఖ అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. నష్టపరిహారంతో పాటు వారి కుటుంబ అవసరాల మేరకు తగిన విధంగా సహాయ, సహకారాలను అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇవాళ సిర్పూర్ (టి) మండలంలోని దుబ్బ గూడెంలో సురేష్ అనే రైతుపై మరో దాడి ఘటన జరగడంతో మంత్రి సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీఎఫ్ఓ నీరజ్‌ రైతు పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాథమిక చికిత్స అనంతరం రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల జిల్లా హాస్పిటల్‌కు సురేష్‌ను తరలిస్తున్నట్టు డీఎఫ్ఓ మంత్రికి వివరించారు.

ప్రస్తుతం పులి కదలికలపై మంత్రి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర వైపు పులి కదలికలను గుర్తించినట్టుగా డీఎఫ్ఓ మంత్రికి తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల పశువులపై కూడా పులి దాడి ఘటనలు నమోదైన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పీసీసీఎఫ్‌ను ఆదేశించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు, పశువులను మేతకు తీసుకొని పోయేవారు జాగ్రత్తగా ఉండాలనీ, అటవీ శాఖ సూచనలను పాటించాలని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like