ములుగులో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
Encounter:తెలంగాణలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు – గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కీలక నేత బద్రు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. ఆయనతో పాటు మృతుల్లో మరికొందరు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఇద్దరు ఆదివాసీలను ఇన్ఫార్మార్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. వారం తిరగకముందే ఏడుగురు మావోయిస్టులను ఎన్కౌంటర్ లో చనిపోయారు.
ఆదివాసీల హత్య అనంతరం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీ కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే.. చల్పాక సమీప అడవుల్లో పోలీసు జవాన్లకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులపైకి కాల్పులు జరపడంతో.. గ్రేహౌండ్స్ బలగాలు తిరిగి కాల్పులు జరిపారు.ఘటనాస్థలంలో రెండు AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన విషయాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.