కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి
-ఏడుగురు పందెం రాయుళ్ల అరెస్టు
-13 పందెం కోళ్లు ,60 కత్తులు, 5 మొబైల్స్, నగదు స్వాధీనం
Police attack on chicken breeding base: కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి చేసి ఏడుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాపులపల్లి గ్రామ శివారులో కోళ్ల పందాల స్థావరం కొనసాగుతోంది. పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. తాళ్ల రాములు(రాగినేడు), యాదగిరి అనిల్ (రాగినేడు), రావుల మధునయ్య (పాలకుర్తి), B.వెంకటేష్ (కొత్తపల్లి), మూల మహేందర్ (బ్రాహ్మణపల్లి), బుడగడ్డ నర్సయ్య (పెద్దపల్లి), మైదాంపల్లి రవితేజ ( సుల్తానాబాద్)ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 పందెం కోళ్లు, 60 కత్తులు, 5 మొబైల్స్ నగదు స్వాధీనం చేసుకున్నారు.