తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపమిదే..

Telangana: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను రేవంత్ రెడ్డి సర్కార్ ఘనంగా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9 వరకు ఈ వేడుకలు నిర్వహిస్తుండగా.. చివరి రోజున సంబురాలు ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా.. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సచివాలయం తరలించారు.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు చకచకా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి మరీ పనులను చేయిస్తున్నారు.

మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహానికి బంగారు కిరీటం, మెడలో బంగారు నగలు, నడుమకు వడ్డాణం ఇలా ఆమెను ఓ రాణిగా చిత్రీకరించారని అందులో కూడా రాచరికపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ లాంటి ఎందరో వీర వనితలు ఉన్నారని ఆమె విగ్రహాన్ని చూస్తే.. మన తల్లిలాగా అనిపించాలంటూ అభిప్రాయపడ్డారు. ఆరోజు రేవంత్ రెడ్డి అన్న మాటలకు తగ్గట్టుగానే.. ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు.

ప్రస్తుతం చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఎలాంటి కిరీటాలు లేకుండా.. సాధారణ మహిళగా కనిపిస్తోంది. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే, ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like