కోనోకార్పస్ చెట్ల తొలగింపు

Removal of Conocarpus trees:శ్వాస కోశ వ్యాధులకు కారణమవుతున్నాయన్న కారణంగా మంచిర్యాల పురపాలిక పరిధిలో పెద్దఎత్తున నాటిన కోనోకార్పస్‌ జాతి మొక్కలను తొలగిస్తున్నారు. మున్సిపాలిటీ లోని ప్రధాన రహదారి తో పాటు పట్టణంలో ఉన్న చెట్లు అన్నిటినీ కట్ చేస్తున్నారు. త్వరలోనే వాటి స్థానంలో వేరే మొక్కలను నాటడం కానీ, ఉన్న మొక్కలు పెరగకుండా ఉండడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పురపాలిక పరిధిలోని ప్రధాన రహదారులు, ఇతర ప్రాంతాలలో ఈ మొక్కలను గతంలో నాటారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఏపుగా పెరగడంతో పాటు అందంగా మొక్కలు కనిపిస్తున్నాయి. తక్కువ సమయంలో గుబురుగా ఆకర్శనీయంగా కనిపించే ఈ మొక్కల పుప్పొడి ఆరోగ్యానికి హానికరమన్న ప్రచారం సాగుతుండటంతో వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు.

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి రావడంతో దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి వెంటనే ఆ జాతి మొక్కలను తొలగించి వాటి స్థానంలో వేరే మొక్కలు తీసుకువచ్చి నాటాలని ఆదేశాలిచ్చారు. దీంతో మొక్కల తొలగింపు బాధ్యతలను పురపాలిక శాఖకు అప్పగించారు. ఇందుకోసం అనుమతులు తీసుకున్న అధికారులు బైపాస్‌ రహదారిలో చెట్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. పట్టణంలో త్వరలోనే ఈ జాతి మొక్కలను తొలగించి ఆరోగ్యకర మైన మొక్కలను నాటతామని చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like