ఉమ్మడి ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగమంచు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఒక వైపు చలి మరో వైపు పొగ మంచు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. వర్షాలు కురియడంతో రెండు రోజుల నుంచి చలి తీవ్రత కాస్త తగ్గింది. కానీ.. పొగ మంచు మాత్రం కుమ్మెస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ తో పాటు, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని ఏజెన్సీ గ్రామాలు, మంచిర్యాల, చంద్రాపూర్ హైవే పై భారీగా పొగ మంచు పేరుకుపోయింది. వాహన దారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు.
దట్టంగా పొగమంచు కప్పేయడంతో సమీపం లో ఉన్న వాళ్ళు కూడా కనిపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. 8 దాటినా వాహన దారులు లైట్స్ వేసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఉదయం ఎనిమిది గంటలు కావస్తున్న పరిసర ప్రాంతాలు కనిపించగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక వాహనాలు నడిపే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. రహదారులను పొగ మంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం అయినా ఆ పొగమంచు కారణంగా రోడ్డు కనపడక పోవడంతో.. లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణిస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా ఇంత పొగ మంచు చూడలేదని వారు అంటున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాహనాలు నడపాలనీ సూచిస్తున్నారు.