ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం
Four members of the same family attempted suicide: ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. సముద్రాల మొండయ్య (60), శ్రీదేవి (50), కూతురు చిట్టి (30) కుమారుడు శివ ప్రసాద్ (26) ఆర్థిక ఇబ్బందులతో మంగళవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. వీరు ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరు. శివ ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగర్ ఎంజీఎం కు తరలించినట్లు సమాచారం.
గతంలో శివ ప్రసాద్ పలువురి వద్ద అప్పులు చేసి ఆన్ లైన్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగా నష్టం వాటిలింది. అప్పులు ఇచ్చిన వారు బాకీ చెలించాలని ఒత్తిడి చేయడంతో క్రిమిసంహారక మందు తాగినట్లు తెలుస్తుంది.