ఆత్మహత్యాయత్నం ఘటనలో ముగ్గురు మృతి
Three killed in suicide attempt:ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మంగళవారం ఆత్మహత్యా ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. సముద్రాల మొండయ్య (60), శ్రీదేవి ( 50), కూతురు చిట్టి (30) కుమారుడు శివప్రసాద్ (26) ఆర్థిక ఇబ్బందులతో మంగళవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. వీరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ నుండి వరంగర్ ఎంజీఎం తరలించారు.
ఈ ఘటనలో చికిత్స పొందుతూ ముగ్గురు మృత్యు వాత పడ్డారు. తండ్రి సముద్రాల మొండయ్య (60), భార్య శ్రీదేవి (50), కూతురు చిట్టి (30) ముగ్గురు మరణించారు. కుమారుడు శివప్రసాద్ (26) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.