విద్యాభారతికి జాతీయ అవార్డు
విద్యాభారతి విద్యా సంస్థకు మరో అవార్డు దక్కింది. వినూత్న పద్ధతిలో విద్యాబోధనకు ఆ సంస్థకు ఈసారి ఏకంగా జాతీయ అవార్డు దక్కించుకోవడం గమనార్హం. బెంగుళూరు తాజ్ హోటల్ లో జరిగిన డైనమిక్ ఎడ్యుకేటర్స్ సమ్మిట్ 2024లో స్టేట్ బోర్డ్ పాఠశాలల విభాగంలో వినూత్న పద్దతిలో విద్యాబోధనకు జాతీయ స్థాయి మెదటి స్థానం సాధించింది. ఎడ్యుకేషన్ టుడే నిర్బహించిన సర్వేలో పెద్ద ఎత్తున ఓట్లు పొంది ఈ అవార్డు సొంతం చేసుకున్నారు.
విద్యాభారతికి ఈ అవార్డు ఆనందంగా ఉందని పాఠశాల నిర్వాహకులు సురభి శరత్ కుమార్ వెల్లడించారు. సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్దమవుతున్న వేళ ఈ అవార్డు రావడం విద్యా భారతి పరివారానికి, అందరికి మరింత శోభ తెచ్చిందన్నారు. అవార్డు రావడానికి కారణమైన అందరికి ధన్యవాదాలు తెలిపారాయన. ఒక మండల స్థాయి పాఠశాలకు జాతీయ స్థాయి అవార్డు రావడం శుభ పరిణామని స్పష్టం చేశారు. తన తండ్రి గొప్ప ఆశయంతో ప్రారంభించిన సంస్థకు మొదటినుండి వెన్నంటి ఉండి సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న అందరికి ఈ సందర్బంగా ధన్యవాదాలని, చక్కటి విద్యను అందించే ప్రయత్నంలో ఎప్పుడు ముందు ఉండే ప్రయత్నం చేస్తాన శరత్ కుమార్ వెల్లడించారు.