రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే..
-14న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి
-లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాలు సత్వర పరిష్కారం పొందవచ్చు
-రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్
Ramagundam Police Commissioner: రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీమార్గం రాజమార్గమని, కక్షలు, కార్పణ్యాలతో ఏమీ సాధించలేమన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్లు, పోలీస్ సిబ్బంది రాజీపడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. వారు రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.