తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి యత్నం
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయిలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో దుండగులు చోరీకి ప్రయత్నించారు. చోరీ చేయడానికి పథకం ప్రకారం దొంగలు గురువారం రాత్రి బ్యాంకు గోడకు రంధ్రం చేశారు. అయితే సైరన్ మోగడంతో పరారయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.