హీరో అల్లు అర్జున్ అరెస్టు

Hero Allu Arjun Arrest: సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. ఈక్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 20 మంది పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు.

హైదరాబాద్ లోని నివాసం నుంచి ఆయనను పోలీసులు తమ వాహనంలో పీఎస్ కు తీసుకెళ్లారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ2గా ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు, కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో బన్నీకి ఊరట లభించలేదు. ఇదే ఘటనలో సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేశారు. థియేటర్ మేనేజర్, మరో సిబ్బంది ఇప్పటికే జైలుకు వెళ్లారు. బన్నీని పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like