అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్
అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కలకలం రేపుతోంది. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది. హైకోర్టులో కూడా అల్లు అర్జున్ క్వాష్ పిటీషన్ క్యాన్సిల్ చేసింది. దాంతో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. కాగా ఇప్పుడు హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.